Monday, May 12, 2025

త్వరలో సీతారామ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజె క్టు, సీతమ్మ సాగర్ మల్టిపర్పస్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందించుకున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి కెప్టెన్ ఉ త్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమన్నారు. శనివారం జలసౌధలో ఆ రెండు ప్రా జెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ భట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పొంగులేటి
శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారులు అదిత్యా దాస్ నాధ్, ఈఎన్‌సి అనిల్ కుమార్, సిఇ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతరామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలో నీటి కేటాయింపులు సాధించ లేక పోయిందని తెలిపారు.

కేవలం 16 నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్ల్యూసి)ని ఒప్పించి 67 టి.ఎం.సి ల నీటిని కేటాయించుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పురోగతిని గురించి మంత్రి వివరిస్తూ ఇప్పటికే మూడు పంప్ హౌస్‌ల నిర్మాణం పూర్తి కావడంతో పాటు నాలుగో పంప్ హౌస్ నిర్మాణ దశలో ఉందని వివరించారు. ఇప్పటి వరకు 97 శాతం పనులు పూర్తి అయినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎన్కురు లింక్ కెనాల్ పనులు పురోగతిలో ఉన్నయని, భూసేకరణను పూర్తి చేయడంతో పాటు టన్నెల్ నిర్మణాలకు సంబంధించిన పర్యావరణ అనుమతులు త్వరితగతిన పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. అయితే ఇదే సమయంలో పనులలో జరుగుతున్న జాప్యంపై ఆయన అధికారులను సూటిగా ప్రశ్నించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. తదుపరి సమీక్షా సమావేశం నాటికి భూసేకరణ పురోగతితో పాటు చెల్లింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. సీతమ్మ సాగర్ మల్టిపర్పస్ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

ఈ ప్రాజెక్టు కు సంబంధించి కొన్ని పనులు అనుమతులు లేకుండానే ప్రారంభించినందుకు జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్‌జిటి) విధించిన రూ.53.41 కోట్ల జరిమానాను రద్దు పరిచేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న 282.8 మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన ప్రతిపాదనలు జెన్ కో సంస్థకు పంపించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. దుమ్ముగూడెం-పాలేరు మెయిన్ కెనాల్ పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని, గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుని పనులలో వేగవంతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఇల్ల్లెందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ప్రతిపాదించిన ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకుంటామని హామీఇస్తూ వాటి సాధ్య సాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News