Monday, May 12, 2025

‘పుల్వామా టెర్రర్ ఎటాక్ మా పనే’.. అంగీకరించిన పాక్ అధికారి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలలో పాలుపంచుకుంటుందని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని మరోసారి స్పష్టమైంది. స్వయంగా పాక్ వైమానిక దళ సీనియర్ అధికారి ఈ విషయాన్ని అంగీకరించారు.  2019లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే దాడితో తమకు సంబంధం లేదని పాక్ ఇన్నాళ్లు బుకాయిస్తూ వచ్చింది. తాజాగా ఈ దాడిలో తమ హస్తం ఉందని పాక్ సైన్యం ఒప్పుకుంది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో పాక్ భారత్ పై డ్రోన్లు, మిస్సైల్స్ దాడికి యత్నించింది. అప్రమత్తమైన భారత సాయుధ దళాలు దాడులను తిప్పి కొడుతూనే పాక్ పై దాడి చేశాయి. ఆ తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగించాయి. ఈ క్రమంలో మీడియాతో సమావేశమైన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. పుల్వామాలో ఇప్పటికే వ్యూహాత్మక ఎత్తుగడను ప్రదర్శించామని అన్నారు. 

“పాకిస్తాన్ గగనతలం, భూమి, జలాలు లేదా ప్రజలకు ముప్పు పొంచి ఉంటే, ఎటువంటి రాజీ పడబోం. దానిని పట్టించుకోకుండా ఉండలేం. మా దేశానికి కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్ ప్రజలు తమ సాయుధ దళాలపై కలిగి ఉన్న నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాం. పుల్వామాలో మా వ్యూహాత్మక ప్రతిభ ద్వారా దానిని తెలియజేయడానికి ప్రయత్నించాం. ఇప్పుడు, మా కార్యాచరణ, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించాం” అని ఔరంగజేబ్ అహ్మద్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News