Monday, May 12, 2025

నా భర్తను విడుదలకోసం మమతా బెనర్జీని కలుస్తా

- Advertisement -
- Advertisement -

పాక్ సైనిక దళాల అదుపులో ఉన్న తన భర్త విడుదలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరించాలని బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహూ సతీమణి రజని కోరారు. ఈ క్రమంలో తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పించాలని ఆమె అధికారులను వేడుకుంటున్నారు. మమతా బెనర్జీ తలచుకుంటే తన భర్త విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సెక్టార్ లో పనిచేస్తున్న నలభయ్యేళ్ల సాహు గత నెల 23న పొరబాటున అంతర్జాతీయ సరిహద్దును దాటడంతో

పాక్ దళాలు అతనిని తమ అధీనంలోకి తీసుకున్నాయి. “ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి నా భర్త విడుదల కోసం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఆమె జోక్యం చేసుకుంటే నా భర్త తప్పక విడుదల అవుతారు” అని రజని అన్నారు. ఇటీవల భారత దళాలు పాకిస్తాన్ కు చెందిన రేంజర్ ను మే3వ తేదీన అదుపులోకి తీసుకున్నాయని, తన భర్తను విడచిపెడితే పాక్ రేంజర్ ను విడచిపెడతామంటూ భారత్ షరతు విధిస్తే ఫలితం ఉండవచ్చని కూడా ఆమె సూచించారు. సాహు కుటుంబం పశ్చిమ బెంగాల్ లోని హూగ్లీ జిల్లాలో నివసిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News