- Advertisement -
ఉధంపూర్‌లో వైమానిక స్థావరం కాపలా విధులలో ఉన్న సైనికుడు పాక్ సైనిక డ్రోన్ శకలం తాకిడితో మృతి చెందాడు. ఈ వైమానిక స్థావరంపై పాక్ సేనలు సాగించిన డ్రోన్ల దాడులను భారతీయ సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే నేలకూలుతున్నదశలో ఓ డ్రోన్ ముక్క జవానును వచ్చి బలంగా తగిలింది. దీనితో ఆయన ప్రాణాలు విడిచినట్లు రక్షణ శాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఉధంపూర్‌లోని డిబ్బెర్ ప్రాంతంలో పాకిస్థానీ సేనల దాడి జరిగింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన సమయంలోనే పాక్ ఈ దూకుడుకు దిగింది. రాజస్థాన్‌కు చెందిన ఈ జవాను సురేంద్ర సింగ్ మోగా వీర మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళుల ప్రకటన వెలువరించారు.
- Advertisement -