Monday, May 12, 2025

బిసి గురుకుల జూనియర్ ఇంటర్‌లో ప్రవేశ గడవు 17కు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

బిసి గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 17 వరకు పొడిగించినట్లు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో https://mjptbcwreis.telangana.gov.in లేదా https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB/ లో అప్లై చేసుకోవాలని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన సూచించారు. ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.

జూనియర్ ఇంటర్మీడియట్ లో రెగ్యులర్ గ్రూప్ లు ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి, హెచ్‌ఇసి లతో పాటు వృత్తి విద్యా కోర్సులు (ఒకేషనల్ కోర్సు) అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-23328266 నెంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News