Monday, May 12, 2025

ఎప్‌సెట్‌లో అబ్బాయిల హవా

- Advertisement -
- Advertisement -

ఇంజినీరింగ్ టాప్10 ర్యాంకులు
వారివే అగ్రికల్చర్ విభాగంలో
ఐదో ర్యాంకు దక్కించుకున్న ఒకే
ఒక అమ్మాయి ఇంజినీరింగ్‌లో
73.26 శాతం, అగ్రికల్చర్‌లో
87.52 శాతం ఉత్తీర్ణత ఈసారి
విద్యార్థుల సెల్‌ఫోన్లకే మార్కులు,
ర్యాంకుల వివరాలు ఫలితాలు
విడుదల చేసిన ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం లో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, 1,51,779 మంది (73.26 శాతం) ఉత్తీర్ణత సా ధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 81, 198 విద్యార్థులు హాజరు కాగా, 71,309 (87. 82 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చే శారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యో గితా రాణా, ఎప్‌సెట్ ఎప్‌సెట్ 2025 చైర్మన్ టి. కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ డా.బి.డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్‌సెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు, నిర్వాహకులకు సిఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

ఎప్‌సెట్‌లో అబ్బాయిలు ర్యాంకుల పంట పండించారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాం కుల్లో 10 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. ఫా ర్మా, అగ్రికల్చర్ ఎంసెట్‌లో టాప్ టెన్ ర్యాంకు ల్లో 10కి 9 ర్యాంకులు అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్ విభాగంలో టాప్ 10లో ఒకే ఒక అమ్మాయి నిలవడం విశేషం. మొదటి ప ది ర్యాంకుల్లో 9ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకోగా, 5వ ర్యాంకు బ్రాహ్మని రెండ్ల దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థికి దక్కిం ది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెం దిన పల్లా భరత్‌చంద్రకు మొదటి ర్యాంకు లభించగా, మాదాపూర్‌కు చెందిన ఉగడాల రామ్‌చరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమసాయి సూర్యకార్తీక్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. నాచారానికి చెందిన మెండె లక్ష్మీభార్గవ్‌కు నాలుగో ర్యాంకు లభించిం ది. మంత్రిరెడ్డి  వెంకట గణేశ్ రాయల్ (మాదాపూర్)కు ఐదో ర్యాంకు,

సుంకర సాయి రిశాంత్‌రెడ్డి (మాదాపూర్) ఆరో ర్యాంకు, రష్మిత్ బండారి (మాదాపూర్) ఏడో ర్యాంకు, బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్)కు ఎనిమిదో ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి (నార్సింగి)కు తొమ్మిదో ర్యాంకు, కొమ్మ శ్రీకార్తీక్ (మేడ్చల్)కు పదో ర్యాంకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా అగ్రికల్చర్-ఫార్మా ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యకు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన చాడ అక్షిత్‌కు మూడో ర్యాంకు లభించాయి. పెద్దింటి రచ్చల సాయినాథ్ (కొత్తకోట, వనపర్తి)కు నాలుగో ర్యాంకు, బ్రాహ్మణి రెండ్ల (మాదాపూర్)కి ఐదో ర్యాంకు, గుమ్మడిదల తేజస్ (కూకట్‌పల్లి)కు ఆరో ర్యాంకు, కొలన్ అఖిరానందన్‌రెడ్డి (నిజాంపేట)కు ఏడో ర్యాంకు, భానుప్రకాశ్‌రెడ్డి (సరూర్‌నగర్)కి ఎనిమిదో ర్యాంకు, అర్జ శామ్యూల్ సాత్విక్ (హైదర్‌గూడ)కు తొమ్మిదో ర్యాంకు, అద్దుల శశికరణ్‌రెడ్డి (బాలాపూర్)కి పదో ర్యాంకు వచ్చాయి.

విద్యార్థుల సెల్‌ఫోన్‌కే ఫలితాలు
ఎప్‌సెట్ ఫలితాలు ఈసారి నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌కే వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఎప్‌సెట్‌లో ఆ విద్యార్థి సాధించిన మార్కులు, ర్యాంకుల వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. ఈసారి ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షలలో ప్రాథమిక కీ లపై విద్యార్థులు అభ్యంతరాలు తెలిపేందుకు ఫీజు చెల్లించే విధానం అమలు చేశారు. ప్రశ్నకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి విద్యార్థులు ప్రాథమిక కీ పై ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలిపారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు. విద్యార్థి ఒక ప్రశ్నపై అభ్యంతరం సమర్పించిన అనంతరం ప్రాథమిక కీలో వెల్లడించిన సమాధానం తప్పు అని తేలితే ఫలితాలు వెలువడిన ఏడు రోజులలోపు విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. కాగా, ఎంపిసి విభాగంలో ఒక విద్యార్థి సమర్పించిన అభ్యంతరం సరైనదని తేలింది. దాంతో ఆ విద్యార్థికి ఏడు రోజుల్లో ఫీజు తిరిగి చెల్లించనున్నారు.

స్వల్పంగా తగ్గిన ఉత్తీర్ణత
ఎప్‌సెట్‌లో ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది. ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో 73.26 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, గత ఏడాది 74.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 87.82 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, గత ఏడాది 86.67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు పూర్తి కాగా, ఈనెల 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎప్‌సెట్ ఫలితాల కోసం విద్యార్థులు వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in చూడాలి.

ఇంజనీరింగ్ ఎప్‌సెట్ టాప్ 10 ర్యాంకర్లు
మొదటి ర్యాంకు- పల్లా భరత్ చంద్ర(ఎపి, పార్వతీపురం మన్యం జిల్లా)
రెండో ర్యాంకు ఉడగండ్ల రామ చరణ్‌రెడ్డి(మదాపూర్, హైదరాబాద్)
మూడవ ర్యాంకు పమ్మిన హేమ సాయి సూర్య కార్తీక్(ఎపి, విజయనగరం జిల్లా)
నాలుగవ ర్యాంకు లక్ష్మి భార్గవ్ మెండె(నాచారం,హైదరాబాద్)
ఐదవ ర్యాంకు మంత్రిరెడ్డి వెంకట గణేష్ రాయల్(మదాపూర్,హైదరాబాద్)
ఆరవ ర్యాంకు సుంకర సాయి రిశాంత్‌రెడ్డి(మదాపూర్,హైదరాబాద్)
ఏడో ర్యాంకు దుష్మిత్ బండారి(మదాపూర్, హైదరాబాద్)
ఎనిమిదవ ర్యాంకు బని బ్రాట మాజే(బడంగ్‌పేట్, రంగారెడ్డి)
తొమ్మిదొవ ర్యాంకు కొత్త ధనుష్‌రెడ్డి(నార్సింగి,రంగారెడ్డి)
పదో ర్యాంకు కొమ్మ శ్రీ కార్తీక్(మేడ్చల్)

అగ్రికల్చర్,ఫార్మా ఎప్‌సెట్ టాప్ 10 ర్యాంకర్లు

మొదటి ర్యాంకు సాకేత్‌రెడ్డి (మేడ్చల్)
రెండో ర్యాంకు సబ్బాని లలిత్ వరేణ్య (కరీంనగర్)
మూడో చాడ ర్యాంకు అక్షిత్ (వరంగల్)కు 3వ ర్యాంకులు వచ్చాయి.
నాలుగవ ర్యాంకు సాయినాథ్ (కొత్తకోట, వనపర్తి)
ఐదవ ర్యాంకు రెండ్ల బ్రాహ్మణి (మాదాపూర్,హైదరాబాద్)
ఆరవ రాంకు గుమ్మడిదల తేజస్ (కూకట్‌పల్లి, హైదరాబాద్)
ఏడవ ర్యాంకు కొలను అఖిరానంద్‌రెడ్డి (నిజాంపేట,హైదరాబాద్)
ఎనిమిదవ ర్యాంకు భానుప్రకాశ్‌రెడ్డి (సరూర్‌నగర్,రంగారెడ్డి)
తొమ్మిదవ ర్యాంకు శామ్యూల్ సాత్విక్ (హైదర్‌గూడ,హైదరాబాద్)
పదో ర్యాంకు అద్దుల శశికిరణ్‌రెడ్డి (బాలాపూర్, రంగారెడ్డి)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News