- Advertisement -
న్యూఢిల్లీ: కాల్పుల విరమణపై ఈ నెల 10న కుదిరిన ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిన పక్షంలో తీవ్రంగా ప్రతిస్పందించడానికి సైనిక కమాండర్లకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 10, 11తేదీల రాత్రి కాల్పుల విరమణ, గగనతల ఉల్లంఘనలకు సంబంధించిన పరిణామాలపై ఆర్మీ చీఫ్ పశ్చిమ సరిహద్దుల ఆర్మీ కమాండర్లతో చర్చించారని ఆర్మీ ఒ క ప్రకటనలో తెలిపింది, ఇరు దేశాల డిజిఎంఓల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా పూర్తి స్థాయిలో ప్రతిస్పందించడానికి ఆర్మీ కమాండర్లకు ఆర్మీ చీఫ్ పూర్తి అధికారాలు ఇచ్చారని కూడా సైన్యం ఆ ప్రకటనలో తెలిపింది.
- Advertisement -