Monday, May 12, 2025

రావల్‌పిండి పిండి

- Advertisement -
- Advertisement -

పాక్ సైనిక ప్రధాన
కేంద్రంలోనూ భారత సేనల
గర్జన బ్రహ్మోస్ క్షిపణితో
భారత్‌కు ఖండాంతర ఖ్యాతి
లక్నోలో క్షిపణి ఉత్పత్తి
కేంద్రం ప్రారంభిస్తూ రక్షణ
మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు

లక్నో : మన వీర భారతీయ సైన్యం పరాక్రమం ఎనలేనిది, తిరుగులేనిది. ఈ సైనిక పరాక్రమం పాకిస్థాన్ సైనిక ప్రధాన స్థావరం ఉన్న రావల్పిండి వరకూ దూసుకువెళ్లి , పరాక్రమించి గర్జించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అరివీర భయంకర బ్రహ్మోస్ ఖండాంతర క్షిపణి ఉత్పత్తి కేంద్రం వర్చువల్ ప్రారంభోత్సవ సభలో రక్షణ మంత్రి మాట్లాడారు. ఉగ్రవాద అణచివేతకు ఇటీవల మనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యనే కాకుండా, ఉగ్రవాదంపై మన పోరులో ఇమిడి ఉన్న రాజకీయ , సామాజిక వ్యూహాత్మకతకు ప్రతీక అయిందన్నారు.
మన విశ్వాసాలకు మన తరాల ఆచరణ క్రమానికి అనుగుణంగానే దాడికి దాడి అనే రీతిన ఈ సైనిక చర్యను చేపట్టారు.

ఇది కేవలం పాకిస్థాన్ సరిహద్దుల్లోని వారి సైనిక కేంద్రాలపై దాడికి దిగడమే కాకుండా మనం మరింత సుదూరం వెళ్లి రావల్సిండిలోని పాకిస్థాన్ సైనిక ప్రధాన కేంద్రాలకు కూడా మనం మన శక్తిని ఆయుధ పాటవాన్ని రుచి చూ పామని రక్షణ మం త్రి తెలిపారు. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాదుల ఏరివేత కు సంకల్పించింది . ఈ క్రమం లో మనం నిర్ణీత లక్షాలను ఎం చుకుని ముందుకు సాగాం, పాక్ పౌరులకు ఎటువంటి ము ప్పు తలెత్తకుండా కేవలం ఉగ్ర శిబిరాల ధ్వంసంతో ఆపరేషన్ జరిగిందని తెలిపారు. ఎక్కడైతే ఉగ్ర శిబిరాలు నెలకొని ఉన్నాయో , గుర్తించి వాటిని నేలమట్టం చేయడం జరిగింది. అంతేకాకుండా భారత వ్యతిరేక, విద్వేషకర శక్తులకు కూడా మనం ఏమిటనేది చాటి చెప్పామని మంత్రి స్పష్టం చేశారు.

భారతీయ విలువల వ్యూహాత్మక ఆపరేషన్
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక పోరు ఆపరేషన్ సిందూర్ అని వివరించారు. మన విజయం ఖండాంతరం అయింది. ప్రపంచవ్యాప్తంగా నిలిచింది. ఇప్పుడు భారతీయ సైనిక పాటవానికి సర్వత్రా బ్రహ్మండరీతిలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయని రక్షణ మంత్రి స్పందించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఎక్కడున్నా వారు క్షేమంగా ఉండలేరు. ఇది భారతీయ సైన్యపు ధర్మయుద్ధం , మన సేనలు ఏ స్థాయిలోనూ అక్కడి పౌరులకు కీడు తలపెట్టలేదు. కానీ భారత్ దాడికి తట్టుకోలేక పాకిస్థాన్ మన పల్లెలపై పౌరులపై దాడికి దిగిందని, పలు ఉదంతాలలో ఈ విషయం సుస్పష్టం అయింది. పొరుగుదేశంలో తలదాచుకుని విర్రవీగే ఉగ్రవాదుల దొంగచాటుగా వచ్చి సాగించిన ప్రతి దాడికి భారతీయ సేనలు తగు విధంగా జవాబు ఇచ్చాయని రక్షణ మంత్రి గుర్తు చేశారు.

బ్రహ్మోస్‌తో సత్తా చాటాం
భారతీయ సైన్యం ధైర్య సాహసాలకు ప్రతీక,ఈ సైనిక పటి మ సందేశాన్ని ప్రపంచానికి మనం ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి ద్వారా తెలియచేశామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారతీయ సైన్యం వీరత్వ సందేశం బ్రహ్మోస్ పాటవంతో దశదిశలా వ్యాపించిందని రాజ్‌నాథ్ చెప్పారు. రక్షణ పటిమలో భారతదేశం ఇప్పుడు అత్యంత శక్తివంతమైన దేశా ల జాబితాలో నిలచింది. రోజురోజుకూ స్థిరంగా మన శక్తి పాటవం ఇనుమడిస్తోందని, ఇటీవలి పరిణామాల నేపథ్యం లో ఈ విషయం మరింత స్పష్టం అయిందని వివరించారు.

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి
బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి అతి పెద్ద కేంద్రంగా లక్నోలోని బిఐటిఎఫ్ సెంటర్ రూపుదిద్దుకుంది. రక్షణ రంగంలో పూర్తి స్థాయి స్వయంసమృద్ధి, మన శక్తిపై మనం ఆధారపడటం వంటి కీలక అంశాలకు ఈ కేంద్రం నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సొంత నియోజవర్గం లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఈ కేంద్రం ఏర్పాటు అయింది. డిఫెన్స్ కారిడార్ అంతర్భాంగా ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు సహకారం పరస్పర ప్రాతినిధ్యం అత్యంత కీలక విషయంగా మారిందని రక్షణ మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News