Monday, May 12, 2025

నేడు అందగత్తెల ఆధ్యాత్మిక పర్యటన

- Advertisement -
- Advertisement -

బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ భామలు రేపు
హైదరాబాద్‌లో చౌమహల్లా ప్యాలెస్ సందర్శన 14న రామప్ప ఆలయం,
వేయి స్తంభాల గుడి, వరంగల్ పోర్టుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాల వివరాల ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా ప్రదేశాల్లో చేపట్టే ఈవెంట్లకు సంబంధించి అధికారికంగా అన్ని ఏర్పాట్లు స్థానిక అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 12న బౌద్ధ ఆధ్యాత్మిక పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ సుందరి 2025 పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన కొంతమంది పోటీ దారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. వీరి రాక సందర్భంగా నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్దవనంలో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న బుధవానాన్ని సందర్శిస్తారు. ముందుగా వీరంతా హైదరాబాద్ నుండి బయలుదేరి నల్గొండ జిల్లా, చింతపల్లి సమీపంలో ఉన్న అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు.

అనంతరం అక్కడి నుండి బయలుదేరి విజయ్ విహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలుకుతారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మహా స్థూపంలోకి ప్రవేశించిన తర్వాత మహా స్థూపానికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News