- Advertisement -
హైదరాబాద్: సిటీలో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన అమన్‌జైన్(32), తన భార్యతో కలిసి కోకాపేటలోని మైహోం అపార్టుమెంట్స్ లోని ఒకటో టవర్‌లో నివాసం ఉంటున్నాడు. కుంగుబాటుకు లోనుకావడంతో కొంత కాలంగా అమన్ జైన్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గత శనివారం ఉదయం అమన్‌జైన్.. 32వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -