Monday, May 12, 2025

తెలంగాణ కోసం సమగ్ర సాంస్కృతిక విధానం

- Advertisement -
- Advertisement -

అనేక నాగరిక సమాజాలలాగానే తెలంగాణకి కూడా చరిత్ర, భౌగోళికత, ఇతర వైవిధ్య భరిత ప్రభావాలు తీర్చిదిద్దిన ఒక సుదీర్ఘమైన, ఘనమైన వారసత్వం ఉంది. ఇక్కడి సారస్వతం, చిత్రకళ, శిల్పకళ, సంగీతం, నృత్యం, నా టకం వీటి కొనసాగింపుగా, ఆ ప్రభావాల పరంపరతో పురుడు పోసుకున్న గ్రాఫిక్ ఆర్ట్, సినిమా లాంటి ఆధునిక కళలతో పాటు, వివిధ కులాల వారసత్వాలుగా సాగి వచ్చిన సుసంపన్నమైన జా నపద కళా సంప్రదాయాల పరంపర కూడా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణపు వెలుగులో తెలంగాణ ప్రాం త చారిత్రక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలను ఒక పరి సింహవలోకనం చేసుకోవాల్సి ఉంటుంది.

సాంస్కృతిక విధానం ప్రతిపాదన
మన దేశ జాతీయ సాంస్కృతిక విధానం క్ర మంగా సంస్కృతిని వెనుక వరుసలకు నెట్టివేస్తూనే పోయింది. ఇటీవల కాలంలో అయితే అది మరీ తన క్షణ దశలో కాళ్లు చాపుకొని కూర్చున్నట్టే ఉం ది. నవ తెలంగాణ సందర్భంలో కొత్త సాంస్కృతిక విధానాన్ని కొత్తవెలుగులో పునర్జీవింపజేయ డం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యం.
సామాజిక అభివృద్ధికి అవసరమైన సాంస్కృతిక కార్యకలాపాలను సకాలంలో అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ సరికొత్త సాంస్కృతిక ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

అకాడమీలు, కార్పొరేషన్లు, ఆర్కైవ్‌లు, లైబ్రరీ లు, మ్యూజియంలు, భాష సాహిత్యాలతో మొదలుకొని ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ ఆర్ట్, సినిమాలతో పాటు, ఇతర అనుబంధ కళలైన నృత్యం, నాటకం, సంగీతం, పె యింటింగ్, శిల్పం మొదలైనవి వివి ధ మంత్రిత్వ శాఖలకు అనుసంధా నం చేయబడి ఉన్నాయి. కాగా ఈ భిన్న బ్యూరోక్రాటిక్ ప్రక్రియల మధ్య సాగే రాతకోతలు లావాదేవీలు సమాచార సరఫరా చాలా కష్టంగా ఉండడంతో సాంస్కృతిక కార్యకలాపాలు అమలు అయ్యేందుకు తీవ్ర జాప్యం జరిగే అవకాశం, ప్రమాదం ఉంది. అందువల్ల, తెలంగాణ సరికొత్త సాం స్కృతిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది.
అందుకోసం సాంస్కృతిక సచివాలయాన్ని స్థాపించాలి. దీనికి బాధ్యులుగా సీఎంవో నుండి కార్యదర్శి ర్యాంక్ అధికారిని సంధానకర్తగా నియమించుకోవాలి. అప్పుడు మాత్రమే వివిధ మంత్రి త్వ శాఖలకు, అకాడమీలకు ఇతర వ్యవస్థలకు మధ్య అనుసంధానం సత్వరం సుసాధ్య, సులభతరమవుతుంది. ఇందుకోసం సచివాలయంలో సా హిత్యం, కళలు, చలనచిత్రం, సాంస్కృతిక వా రసత్వం, జాతీయ, అంతర్జాతీయ లావాదేవీ లు వంటి నాలుగు పరిపాలనా విభాగాలు ఉండాలి.
కళలు సాహిత్యం

ఈ విభాగంలో నృత్యం, నాటకం, సంగీతం, కళ, ఫొటోగ్రఫీ, జానపదం, భాష, సాహిత్యం వంటి విభాగాలు ఉంటాయి. దీనిని ముందుకు తీసుకెళ్లడం కోసం పూర్వ తెలంగాణలోని పది జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 10 సాంస్కృతిక సముదాయాలు నిర్మించాలి. ఈ స ముదాయంలో నాలుగు ప్రధాన భవనాలు ఉండా లి. -సాంస్కృతిక కళాశాల నిర్మించడం, వారసత్వా న్ని అధ్యయనం చేయడం, మూడు ఆడిటోరియం లను, కాన్ఫరెన్స్ హాల్స్‌ను నిర్మించటం, సినిమాల ను ప్రదర్శించే ఏర్పాట్లను చేయడం, మ్యూజియం, గ్రంథాలయాల ఏర్పాటుతో పాటు, ఫొటో, పెయింటింగ్ ప్రదర్శనల కోసం విశాలమైన ఆర్ట్ గ్యాలరీ లు ఏర్పాటు చేయాలి.

హైదరాబాద్ కేంద్రంగా
హైదరాబాద్ నగరంలో పది ఎకరాల స్థలంలో మరొక భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ కళాకారులు, రచయితలు, నాటకకర్తలు సినిమా కళాకారుల శిక్షణా శిబిరాలను నిర్వహించుకునేందుకు 25 షెడ్లను నిర్మించాలి.
తెలంగాణలో ఆడిటోరియంల పునరుద్ధరణనగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఆడిటోరియంలకు అవసరమైన రిపేర్లను చేసి ఆధునీకరిస్తే కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలంగాణ అంతటా ఉన్న నెహ్రూ బాలభవన్‌లను తక్షణం పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టాలి. తెలంగాణలోని పది జిల్లాలకు శిల్పారామాలను ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించి నిర్మాణ పనుల్ని తక్షణమే చేయాలి.

సినిమా రంగం
ఇది సమాచార, డిజిటల్ యుగం. ప్ర పంచమంతా దృశ్య శ్రవణ ప్రపంచంగా మా రిపోయింది. సాంకేతిక విప్లవంలో సినిమా కీలక మాధ్యమంగా మారింది. సినిమా లు వాటి అధ్యయనం ఎంతో ప్రాముఖ్య తకలవి. ప్రపంచమంతా ఈ అధ్యాయనానికి పెద్దపీట వేస్తారు. తెలంగాణలో సిని మా, సినిమా అధ్యయనం అభివృద్ధి చెం దవలసినంతగా ఇంకా అభివృద్ధి కాలేదు.
తెలంగాణ సినిమా వ్యాప్తికి, వృద్ధికి తెలంగాణలోని నిపుణుల, మేధావుల, కళాకారుల సహాయ మే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ, నిపుణుల, సంస్థల సహాయం, సహకారం కోరవలసి ఉంది. సినిమాలకు సంబంధించి నిర్మాణం, ప్రచారం, ప్రదర్శన అనే కార్యకలాపాలు ఉంటాయి. సినిమా రంగ అభివృద్ధికి అవసరమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవడం మొదటి, తక్షణ కర్తవ్యం.

పైడి జయరాజ్ సినిమా ఘర్
ఈ పేరుతో పది ఎకరాలలో ఒక సినిమా కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలి. తెలంగాణ సినిమా కు సంబంధించిన సకల కార్యకలాపాలు, వ్యా పా ర, వాణిజ్యాలకు చిరునామాగా, కళాకారుల కష్టాలను తీర్చే వేదికగా, ఈ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దాలి. ఫిలిం ఛాం బర్ ఆఫ్ కామర్స్, సినిమా వ్యాపార కేంద్రం, ఉండాలి. సినిమా రంగ సక ల విభాగాలను సమీకృతం చేసే దిశ గా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ని అన్ని రకాలుగా విస్తృతపరచాలి.
బాలల చిత్రాల కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేయాలి. ఈ సినిమా ఘర్‌లో నిర్మాతల, దర్శకుల సినిమా కళాకారుల సినిమా జర్నలిస్టుల సంఘాల, అలాగే 24 కళలకు సంబంధించిన కార్యాలయం కూడా ఉం డాలి. సినిమా పత్రిక కోసం, సినిమా రచనల ప్రచురణ కోసం ఒక విభాగం, ఈ రంగానికి సంబంధించిన అత్యుత్తమ రచనలు లభించే ఒక పుస్తకాల షాపు కూడా ఉండాలి. అన్ని ఆధునిక హంగులు, వసతులున్న మూడు ఆడిటోరియంలోని దీనిలో నిర్మించాలి.
శ్యాం బెనగల్ సినిమా అకాడమీ

సినిమా రంగంలో మేలిమి కృషి చేసిన తెలంగాణ వాసి శ్యాం బెనగల్ పేరుతో 25 ఎకరాలలో విశాలమైన, సమగ్రమైన అకాడమీ స్థాపించాలి. అందులో పరిశోధన, శిక్షణ అనే రెండు విభాగాలు ఉండాలి.
జాతీయ, అంతర్జాతీయ సినిమా సంస్థలతో సెమినార్లు, శిక్షణా శిబిరాలని ఇక్కడ నిర్వహించాలి. ఫిలిం ఇన్‌స్టిట్యూట్, సిని మా పరిశోధనా సంస్థ, గ్రంథాల యం, ఫిలిమ్స్ సొసైటీ కార్యాలయాలు, బాలల చలనచిత్ర క్లబ్, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ (FF), ఈ కార్యకలాపాల కోసం నాలుగు సినిమా ధియేటర్లు నిర్మించాలి.
బి.ఎస్.ఎన్.సినిమా రిక్రియేషన్స్ సెంటర్

తెలంగాణ సినిమా రంగానికి చెందిన వారి కోసం ఏర్పాటు చేయాల్సిన రిక్రియేషన్స్ సెంటర్ ఇది. పది ఎకరాలలో అత్యంత ఆధునిక వసతులతో సౌకర్యాలతో నిర్మించాల్సిన క్లబ్ ఇది. కాంతారావు సెంటర్ ఫర్ సినిమా రిహాబిలిటేషన్ సినీ పరిశ్రమ కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఇది. ఈ కల సాకారం కావాలంటే తెలంగా ణ ప్రభుత్వం 80 ఎకరాలు స్థలాన్ని కేటాయిస్తూ, అన్ని వసతులతో కూడిన అపార్ట్‌మెంట్లను జిల్లాలను నిర్మించుకునేందుకు దోహదం చేయాలి.
పి.ఆర్.చిత్రా స్టూడియోస్
సినిమాను నిర్మించడానికి ఒక అత్యాధునిక స్టూడియో 200 ఎకరాల స్థలంలో అత్యంత సాంకేతికతతో దీని నిర్మాణం జరగాలి. ఇది వ్యయప్రాయాసలతో కూడిన పని అయినప్పటికీ, తెలంగాణ సినిమా ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక అవగాహనతో ఈ పనిని చేపట్టాలి. ఇప్పుడు 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సమీకృత పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిశ్చయించింది. కాబట్టి ఈ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే సినిమాను బోధనాంశంగా చేర్చాలి. ఇది తె లంగాణ సినిమా వికాసానికి నాంది పలుకుతుంది.

సాంస్కృతిక వారసత్వం
తెలంగాణకు ఒక సాంస్కృతిక విధానం ఉం డాలి అంటే, మన సాంస్కృతిక వారసత్వం పట్ల నిశితమైన సమగ్ర అవగాహన కలిగివుండాలి. ఆ వారసత్వాన్ని అలవర్చుకోవాలి, కొనసాగించాలి. తెలంగాణ సంస్కృతిలో, మన సాంస్కృతిక ఆచార వ్యవహారాలు, వాటి నేపథ్యం, వికాసం, పరిణా మం, వీటితోపాటు ఈ వారసత్వ సంపదలో కట్టడాలు, నిర్మాణాలు, వస్తుసంపత్తి, సాహితీ కళా నైపుణ్యాల ఫలాలు అన్నీ ఉంటాయి. ఈ చారిత్రక వికాసాన్ని ఎలా చూడాలి, పునర్ పరిశీలన ఎలా చేయాలి అనే దానితో, కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వచ్చి చరిత్ర పునర్నిర్మించబడుతుంది.
మన ముందు తరాలకు మనదైన వారసత్వాన్ని నిలపాలి, భద్రపరచాలి అనుకున్నప్పుడు,
పురావస్తు శాఖ, పురావస్తు ప్రదర్శనశాల లు, పురానిక్షిప్త శాఖ, గ్రంథాలయాలు, పుస్తక ప్రచురణలు వంటి ఐదు మాధ్యమాలు అవసరం.
వీటికి అవసరమైన నిర్దిష్టమైన నిర్మాణ పరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అవసరమైన నిధులు కేటాయించాలి.
రాష్ట్ర ప్రచురణల విభాగం తెలంగాణ సంస్కృ తి, తెలంగాణ వికాసం కోసం పాటుపడిన వారి జ్ఞాపకాలని, ప్రజల పరిస్థితి తెలిపే కొన్ని కాఫీ టేబుల్ పుస్తకాలను తప్పకుండా ప్రచురించాలి. ముందు తరాల కోసం తెలంగాణా సంస్కృతిని భ ద్రపరచడానికి ఇలాంటి పుస్తకాల ప్రచురణ చాలా అవసరం. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కళల పరిరక్షణ కోసం ఆలోచించి, అందుకు అవసరమైనటువంటి నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News