- Advertisement -
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నవదళపతి సుధీర్ బాబు (sudeer babu) హీరోగా తమ 51వ ప్రొడక్షన్‌ను ప్రకటించింది. ఈ చిత్రానికి ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అధికారికంగా సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఇందులో సుధీర్ బాబు షర్ట్ లెస్ గా, సాలిడ్ ఫిజిక్ తో ఇంటెన్స్ లుక్ లో కనిపించా రు. మెట్లపై మృతదేహాలు పడిపోతుండగా, ఆయ న ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుని పైకెత్తుతూ కనిపించడం చాలా ఆసక్తిని కలిగించింది. ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందించబడుతోంది. ఈ పాత్ర కోసం మరోసారి సుధీర్ బాబు తన ఫిజిక్‌ని మేకోవర్ చేస్తూ, కండలు తిరిగిన మాచో లుక్‌లో మారిపోయారు. బలమైన యాక్ష న్ పాత్ర కోసం ఆయన బీస్ట్ మోడ్ వెళ్ళారు.
- Advertisement -