Monday, May 12, 2025

తొలిసారి తెలుగు పాట పాడిన యువన్ శంకర్ రాజా

- Advertisement -
- Advertisement -

తండ్రి ఇళయరాజా బాటలో నడిచి సంగీత దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న యువన్ శంకర్ రాజా, గాయకునిగా కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా ఇళయరాజా స్వర సారధ్యంలో కొన్ని తమిళ పాటలు పాడిన యువన్ శంకర్ రాజా, తొలిసారిగా ‘షష్టి పూర్తి’ (shasti poorthi) సినిమా కోసం డైరెక్ట్‌గా తెలుగులో పాట పాడారు. ఆ క్రెడిట్, ఆ లక్ తమకు దక్కడం పట్ల చాలా ఆనందం వెలిబుచ్చారు నిర్మాత రూపేష్, దర్శకుడు పవన్ ప్రభ. డా. రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాలోని రెండు పాటలను, టీజర్‌ను విడుదల చేయగా విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు మూడో పాట రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే..’ ను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, నిత్యశ్రీ ఆలపించారు. జంగ్లీ మ్యూజిక్ సంస్థ ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది. ఈ సంధర్భంగా యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ.. ‘మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కూల్ సాంగ్’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News