Monday, May 12, 2025

కెపిహెచ్‌బిలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిటీలో గంజాయి ఓ ముఠా రెచ్చిపోయింది. నగరంలోని కెపిహెచ్‌బి పరిధి సర్దార్‌పటేల్‌ నగర్‌లో ఓ యువకుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక పార్కులో అర్థరాత్రి గంజాయి సేవిస్తూ అల్లరి చేస్తున్న గంజాయి గ్యాంగ్‌ను పక్కనే ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వెంకటరమణ ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించాడు.

అయితే గంజాయి మత్తులో ఉన్న ముఠా ఆగ్రహంతో వెంకటరమణపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో గుండెల్లో పొడిచి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News