నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. (Thriller Eleven) సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజల్స్ దర్శకత్వం వహించారు. ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ..‘ఈ సినిమా ట్రైలర్ చూశాను డైరెక్టర్ లోకేష్ అద్భుతంగా తీశాడని అనిపించింది. కథ, కంటెంట్ ను నమ్ముకొని చేసిన సినిమా ఇది‘ అని అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్ ని ఇప్పటివరకు ఏ థ్రిల్లర్ లో కూడా చూసి ఉండరు. ఒక 30 మినిట్స్ చాలా ఎమోషన్ కి గురి అవుతారు. ఆ ఎమోషన్ ఆడియన్స్ కి ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది‘ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లోకేష్, కరుణకుమార్, హీరోయిన్ రియా పాల్గొన్నారు.