- Advertisement -
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై ప్రధాని మోడీ.. త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. సోమవారం ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్ లు కూడా హాజరయ్యారు. శనివారం కాల్పులు, సైనిక చర్యల విరమణకు భారత్-పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. దీంతో భారత ఆర్మీని సరిహద్దులో సంసిద్దత చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దులో ప్రశాంత వాతావరణ ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, కాల్పుల విరమణపై ఇవాళ భారత్-పాక్ మధ్య చర్చలు జరగనున్నాయి.
- Advertisement -