Tuesday, May 13, 2025

సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాఫ్ట్ వేర్, లైఫ్ సెన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జిసిసి హబ్ గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్ రామ్ గూడలో సొనాటా సాఫ్ట్ వేర్  (Sonata Software) సంస్థ ఫెసిలిటీ సెంటర్ ను సిఎం ప్రారంభించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ యాజమాన్యం, ఉద్యోగులు అందరికీ శుభాభినందనలు తెలిపారు. ఎఐతో పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని కొనియాడారు. ఎఐ- రెడి డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని, కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని తెలియజేశారు. మరిన్ని ప్రపంచస్థాయి కార్యక్రమాలకు ప్రభుత్వం యోచన చేస్తోందని చెప్పారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని, ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహకారం కోరుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News