- Advertisement -
న్యూఢిల్లీ: పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తొలిసారిగా మీడియాతో మాట్లాడనున్నరు. ఈ సమావేశంలో మోదీ ఏం చెబుతారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన రోజు నుంచి మోదీ నిరంతరం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు(Speech). ఈ ప్రసంగంలో మోదీ ఏం చెబుతారా అని ప్రతీ ఒక్క భారతీయుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Advertisement -