టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సోమవారం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త విరాట్ అభిమానులకు ఎంతో బాధను మిగిల్చింది. తాజాగా విరాట్ రిటైర్‌మెంట్‌పై ఆయన భార్య అనుష్క శర్మ(Anushka Sharma) స్పందించారు. సోషల్‌మీడియా వేదికగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్‌ను పెట్టారు.
అందరికి విరాట్(Virat Kohli) సాధించిన రికార్డులు, మైలురాళ్లు గుర్తుంటాయి కానీ.. తనకు మాత్రం విరాట్ దాచుకున్న కన్నీళ్లు, బయటకు తెలియకుండా చేసిన యుద్ధాల గురించి గుర్తండిపోతాయని అనుష్క(Anushka Sharma) అన్నారు. ‘‘టెస్ట్ ఫార్మాట్‌పై నువ్వు చూపించిన అమితమైన ప్రేమ నాకు తెలుసు. ఈ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఎంత ఆలోచించావో నేను అర్థం చేసుకోగలను. ప్రతీ టెస్ట్ సిరీస్ తర్వాత నువ్వు ఎంత గొప్పగా తిరిగి వచ్చేవాడివి. నువ్వు టెస్ట్ క్రికెట్‌లో ఎదిగిన విధానాన్ని దగ్గరుండి చూడటం నా అదృష్టం. ఏదో ఒక రోజు నువ్వు వైట్స్ నుంచి రిటైర్ అవుతావని నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు నీ మనస్సు చెప్పిందే వింటావు. కాబట్టి నేను ఒకటే మాట చెప్పదలచుకున్నాను. నువ్వు గుడ్‌బై చెప్పేందుకు అర్హుడివి’’ అంటూ అనుష్క పోస్ట్ చేశారు.