గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం రాజ్ భవన్‌లో సిఎం రేవంత్ గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. దీంతోపాటు ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్‌పై సిఎం రేవంత్ గవర్నర్‌తో చర్చించినట్టుగా సమాచారం. వీటితోపాటు మిస్ వరల్డ్ 2025 వేడుకలకు గవర్నర్‌ను సిఎం రేవంత్ ఆహ్వానించినట్లుగా తెలిసింది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్-, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, తెలంగాణలో భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్టుగా తెలిసింది. అలాగే, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ భేటీలో సిఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.