ఎపి లోని పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండ గిరి ప్రదక్షి ణలో అపశృతి చోటు చేసుకుంది. ఓ భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా ఛాతిలో నొప్పితో అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచాడు. ప్రతి పౌర్ణ మికి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్న విషయం విదితమే. గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అధికారులు సౌకర్యాలు కల్పించారు. ఎప్పటి లాగే సోమవారం కూడా తెల్లవారుజామునే గిరి ప్రదక్షిణ ప్రార ంభమైంది. పురుషోత్తపట్నంకు చెందిన భక్త బృందం ఈ ప్రదక్షిణంలో పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నప్రదక్షిణ పూర్తి చేయడానికి గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది.
ఈ క్రమంలోనే పురుషోత్తపట్నంకు చెందిన ప్రసాద్ అనే యాభై ఏళ్ల వయ సున్న భక్తుడు దాదాపు ఆరున్నర కిలోమీటర్ల దూరం పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత ఊపిరి అందకపోవడంతో ఒక్కసారిగా ఆగిపో యాడు. వెంటనే ఛాతి నొప్పతో భాదపడుతూ రోడ్డుపై పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన తోటి భక్తులు వెంటనే ప్రసాద్‌కు సిపిఆర్ చేశారు. అతడ్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి ప్రసాద్ మృతి చెందాడు. గుండెపోటుతో ప్రసాద్ చనిపోయినట్లు భక్తులు భావిస్తున్నారు. ప్రసాద్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.