2023 నుంచి ఇప్పటి
వరకు రూ.3లక్షల కోట్ల
పెట్టుబడులు సమీకరించాం
లక్షకుపైగా ఉద్యోగాలు
సృష్టించాం ఒక్క
దావోస్‌లోనే 1.78లక్షల
పెట్టుబడులు సేకరించాం
రాష్ట్రంలో మరిన్ని
అంతర్జాతీయ ఈవెంట్ల
నిర్వహణకు ప్రణాళికలు
తెలంగాణ రైజింగ్ ద్వారా
అభివృద్ధి, సంక్షేమంలో
సమతూకం సాధిస్తున్నాం
సోనాటా సాఫ్ట్‌వేర్
కంపెనీ కొత్త క్యాంపస్
ప్రారంభోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 ల క్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగా లు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త క్యాంపస్‌ను సి ఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 2025లో దావోస్‌లో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను రాబ ట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని సిఎం చెప్పా రు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో నిలిచామని ఆయన అ న్నారు. రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్ర వ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్ల లో నంబర్ వన్‌గా ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని సిఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలోనూ, హైదరాబాద్‌ను అద్భుత నగరం గా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామని ఆయన తెలిపారు.
అన్ని రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని, హైదరాబాద్‌ను బ్రాం డ్ అంబాసిడర్‌గా మార్చాలని, మన విజయాలను ప్రపంచానికి చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్‌లలో ఒకటిగా పేరు పొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జ రుగుతున్నాయని ఇలాంటి మరిన్ని జరుపుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కు తమ ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు క ల్పించిందన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్, లైఫ్ సై సెన్స్‌తో పాటు ఇంకా అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌కు హబ్‌గా మారిందన్నారు. ఏఐ డేటా సెంటర్లు, తయారీ
రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. నగరంలో అనేక ప్రముఖ కంపెనీలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని సిఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటీజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
పెట్టుబడుల్లో నంబర్‌వన్
66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోందని ఆయన చెప్పారు. ట్రాన్స్‌జెండర్‌లను స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన చెప్పారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.