Tuesday, May 13, 2025

పాక్ బతకాలంటే.. ఉగ్రవాదం చావాలి

- Advertisement -
- Advertisement -

ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం కాల్పుల
విరమణకు పాక్ పరిగెత్తుకొచ్చింది సైన్యం సాహసానికి సెల్యూట్
పాకిస్తాన్‌తో చర్చలు అంటూ జరిగితే అవి ఉగ్రవాదం..పిఒకె
అప్పగింతపైనే ఉగ్రవాదం, వాణిజ్యం ఒకేసారి జరగవు రక్తం,
నీళ్లు ఒకేసారి పారవు అణు బ్లాక్‌మెయిలింగ్ సహించేది లేదు
ఇది యుద్ధాలు, ఉగ్రవాదంపు యుగం కాదు భారత్ షరతుల
మేరకే పాకిస్తాన్‌తో చర్చలు సిందూర్‌తో భారతీయ సైనికశక్తి
జగద్విదితం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:అణ్వాయుధబ్లాక్‌మొయిల్, అణుయుద్ధ బెదిరింపులను భారతదేశం సహించదు. ఇవి జాతి ముందు అణువంత కూ డా చెల్లనేరవని ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై సైన్యం వీరోచిత చర్య ఆపరేషన్ సిందూర తరువాతి దాడుల పిమ్మట ప్రధా ని మోడీ సోమవారం జాతిని ఉద్ధేశించి ప్రసారసాధనాల ద్వారా తొలిసారిగా జాతి ని ఉద్ధేశించి ప్రసంగించారు. అణ్వాయుధంతో విరుచుకుపడుతామని ఎంతకాలం బెదిరిస్తారు? ఇటువంటి ఉత్తరకుమార ప్ర గాల్భాలు తమ దేశం ముందు కు ప్పిగంతు లే అవుతాయి. వీటిని భారతదేశం ఏ రీతి లో కూడా సహించబోదని ఆయన స్పష్టం చేశారు. సైనిక దాడులను నిలిపివేయాలని పాకిస్థాన్ పదేపదే ప్రాధేయపడిన తరువాతనే మనం కాల్పుల విరమణ , సైనిక చర్యల నిలిపివేతకు దిగామని ,

ఇది తాను జాతికి అందిస్తున్న సమాచారం అని వివరించారు. అయితే పాకిస్థాన్ తన దుస్సాహస చర్యలను అన్నింటిని నిలిపివేస్తానని హమీ ఇచ్చిన తరువాతనే కాల్పుల విరమణ కుదిరిందని తెలిపారు. అయితే పాకిస్థాన్ వక్రబుద్ధి గురించి అందరికీ తెలిసిందే కాబట్టి, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత ఇతర కటుతర చర్యల అమలును ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇది యుద్ధాల యుగం కాదని , ఇక దీనికి తోడుగా ఉగ్రవాద చర్యల కాలం కాదని అంతా తెలుసుకుని తీరాలని మోడీ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆరంభంలో ప్రధాని మోడీ ఇది యుద్ధాల శకం కాదని తెలిపారు.దీనిని గుర్తు చేస్తూ ఇది ఉగ్రవాద చర్యలకు కూడా వర్తిస్తుందన్నారు. ఈ ప్రపంచం యుద్ధాలు భయాలు , ఉగ్రవాద ఉన్మాదాలు లేని శకంతో గడపాల్సి ఉందని పిలుపు నిచ్చారు.

శత్రు కదలికలను బట్టి తదుపరి చర్యలు
పాకిస్థాన్ తదుపరి వైఖరిని బట్టి తరువాతి చర్య ఉంటుందని ప్రధాని తెలిపారు. తోక ముడిచింది కాబట్టి వెనుకకు తగ్గాం అని అయితే ఇకపై తోక జాడిస్తే ఇక కత్తిరింపు చర్యనే అన్నారు. పహల్గాం ఉగ్ర చర్య అత్యంత పైశాచికం, అమానుషం, అనాగకరికం. గర్హనీయం అన్నారు. భారతీయ మహిళల నుదుటిన మెరిసే కుంకుమ చెరిపివేత ఘటన ఇది. ఇది జాతికి తనకు అత్యంత బాధాకరం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎంతో నష్టపోయినట్లు భావించానని , అయితే ఇప్పుడు మన వీర సైన్యం జరిపిన చర్యలతో శత్రువులు తగు శిక్ష అనుభవించారు. ఓ మహిళ నుదుటి సిందూర చెరిపివేత జరిగితే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది వారికి తెలిసివచ్చిందని అన్నారు. ఆపరేషన్ సిందూర కేవలం ఓ సంకేత నామమే కాకుండా అంతకు మించి శక్తివంతం. ఇది శతాధిక కోట్ల భారతజాతి భావోద్వేగ ప్రతీక అయింది. ప్రపంచానికి ఈ భారత జాతి శక్తి , దెబ్బకు దెబ్బ తీసే అంతర్లీన సజీవ లక్షణం గురించి తెలిసివచ్చేలా చేసిందని మోడీ చెప్పారు. ఏదో చేస్తామని బెదిరించే వారిని చెప్పి మరీ చిత్తు చేసే శక్తి మనకు ఉందని నిరూపితం చేశామని ఆయన భావోద్వేగంతో తెలిపారు.
సిందూర ఉగ్రనిరోధక విధానం

ప్రపంచానికి ఇది నయా సిల్‌సిలా
ఆపరేషన్ సిందూర భారతదేశం ప్రకటించిన ఉగ్రవాద వ్యతిరేక , నిర్మూలన విధానం పాలసీకి నిదర్శనం అని ప్రధాని తెలిపారు. సైనిక చర్యను నిలిపివేశామని, అయితే ఇతరత్రా చర్యల అమలును కేవలం వాయిదా వేశామని తరువాతి సమీక్షల్లో తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మనం ఒక సంపూర్ణ స్థాయి ఉగ్రవాద నిరోధక విధానం రూపొందించుకున్నామని, ఇది ఆపరేషన్ సిందూరతో కార్యరూపం దాల్చిందని తెలిపారు. ఉగ్రవాదపు మూలపుటేళ్లను తుదిదాకా పెకిలించి పారేయడం ఈ విధానం అన్నారు. ఉగ్రవాదులు వేరు, ఉగ్రవాద ఊతం ఇచ్చే వారు వేరు కాదు. వీరే వారు వారే వీరు అని తేలిందని ఇందుకు అనుగుణంగానే భారత్ స్పందన ఉంటుందని తెలిపారు.

ఇది యుద్ధాల కాలం కాదు అంతేకాకుండా ఉగ్రవాదపు కాలం కూడా కాదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద శిబిరాల ఏరివేత , వాటి వ్యవస్థల నిర్మూలనే భారత్ ముందున్న లక్షం. పాకిస్థాన్ ముందుగా తమ దేశంలోని ఉగ్రశిబిరాల వ్యవస్థలను తొలిగించుకోవల్సి ఉంటుంది. ఇకపై ఆ దేశంతో జరిపే ఏ చర్యలు అయినా ఈ ఉగ్ర శిబిరాల నిర్మూలనపై ఆధారపడి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. శాంతి సుస్థిరతల స్థాపన అనేది పాకిస్థాన్ తదుపరి చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ముందుగా ఆ దేశం ఉగ్రశిబిరాల ఏరివేతను చేపట్టి , ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాల్సి ఉందన్నారు. ఉగ్రవాదం , వ్యాపారం , ఉగ్రవాదం చర్చలు ఓకేసారి జరిగేవి కావని, ఉగ్రవాదం వీడితేనే చర్చలు అని పాకిస్థాన్ ఇకనైనా తెలుసుకోవాలన్నారు.

ఉగ్రవాద నిర్మూలన , పిఒకెపైనే చర్చలు
పాకిస్థాన్‌తో ఇకపై ఎటువంటి చర్చలు జరగాలన్నా ముందుగా ఆ దేశం వైఖరిలో మార్పు కీలకం. ఇక భారత చర్చల అజెండాలో రెండే రెండు కీలక అంశాలు ఉంటాయని, ఉగ్రవాదం దీని నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) ఈ రెండే కీలక విషయాలు అవుతాయి. వీటిపై వైఖరిని సుస్పష్టం చేసుకుంటేనే పాకిస్థాన్‌తో ఇకపై భారత్ చర్చలు ఉంటాయని లేకపోతే ఆ ప్రసక్తే లేదన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదం వీడితేనే ఆ దేశంతో వాణిజ్య ఇతరత్రా చర్చలకు అవకాశం ఉంటుందని, ఇదే భారత దేశ విధానం అని ప్రధాని వివరించారు. ప్రధాని మోడీ ప్రసంగం 22 నిమిషాల పాటు హిందీలో గంభీర స్థాయిలో సాగింది. పాకిస్థాన్ ఎంతగానో ప్రాధేయపడి రాజీ బేరానికి వచ్చింది. ఇక దీనిని నిలుపుకునే విధంగా చేసుకోవడం, చేసుకోలేకపోవడం ఆ దేశ చేష్టలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. పొరుగుదేశం చేష్టలను భారత్ నిశితంగా పరిశీలిస్తుందని , ఎక్కడ తేడా కొట్టినా , నెత్తి మీద వేలాడే ఖడ్గాలు పనికి దిగుతాయని మోడీ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

ఘనమైన దేశం ….వీర సైనికులు
ఈ ఖ్యాతి అంతా నారీమణులకు అంకితం
మన దేశం సాగించిన సిందూర ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరులో ఆదర్శం అయింది, కలకాలం నిలిచి ఉంటుంది సైనిక బలగాల పరాక్రమంతో మనం ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసేశామని , కేవలం వారి శిబిరాల ధ్వంసం జరగడమే కాకుండా పాకిస్థాన్ ధైర్యం కూడా సన్నగిల్లిందని తెలిపారు. జాతి ఉక్కు సమాన సంకల్పానికి దిగితే దీని ముందు ఏ శక్తి నిలువజాలదు. ఇప్పటి ఘటనలు దీనిని నిరూపించాయని మోడీ తెలిపారు. ఉగ్రవాదం సాగిస్తూ వ్యాపార చర్చలకు వచ్చే ఏ పక్షంతో అయినా తమ చర్చల ప్రసక్తే లేదని మోడీ స్పష్టం చేశారు. మన సైనికులకు శాల్యూట్ చేస్తున్నానని, వారి ధైర్యసాహసాలు , త్యాగనిరతి శక్తియుక్తులు అన్నింటిని కూడా ఈ జాతి తల్లులు, కూతుళ్లు సోదరీమణులకు అంకితం చేస్తున్నామని, ఇది ఓ పవిత్ర వలయంగా కలకాలం విలసిల్లుతుంది. జగతిలో వెల్లివిరుస్తుందని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News