Tuesday, May 13, 2025

అణుయుద్ధం ఆపా

- Advertisement -
- Advertisement -

కాల్పుల విరమణకు
వాణిజ్యాన్నే ఆయుధంగా
మలుచుకున్నా విరమణ
జరగకపోతే వాణిజ్యం
ఆపేస్తానని చెప్పా రెండు
అణుదేశాల మధ్య
మధ్యవర్తిత్వం వహించా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్ : భారత్‌-పాక్ నడుమ అణ్వాయుధ ఘర్షణను అపగలిగానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. లేకపోతే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేందని అభిప్రాయపడ్డారు. ఘర్షణ నిలిపివేస్తే ఇరుదేశాలతో భారీ ఎత్తున వాణిజ్యం నెరుపుతామని చెప్పినట్టు వెల్లడించారు. ‘శనివారంనాడు నా పాలనాయంత్రాంగం అత్యవసర సంపూర్ణ కాల్పుల విరమణకు మధ్వవర్తిత్వం నెరిపింది. భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన ఇరు దేశాల మధ్య భయంకరమైన వివాదానికి ముగింపుపలకగలిగాం. రెండు దేశాలు ఏ మాత్రం వెనక్కి తగ్గని రీతిలో ఘర్షణను నిలిపివేసే ఉద్దేశంతో లేని సమయంలో చొరవ తీసుకున్నాం.

కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా చరిత్రాత్మక సంఘటనలు చోటుచేసుకుంటాయి’ అని ట్రంప్ వైట్‌హౌస్‌లో వ్యాఖ్యానించారు. భారత్, పాక్ నాయకత్వాలు చూపిన చొరవకు గర్విస్తున్నట్టు చెప్పారు. భారత్, పాక్‌లతో మున్ముందు పెద్ద ఎత్తున వాణిజ్య వ్యాపారాలు చేయాల్సి ఉందని, ఈ ఘర్షణను ఇంతటితో ఆపండి, పరస్పర చర్యలు నిలిపివేస్తేనే అవి జరుగతాయని, లేకపోతే వాణిజ్యం ఇరు దేశాలతో నిలిచిపోతుందని కూడా చెప్పినట్టు ట్రంప్ వివరించారు. ఇప్పటికే భారత్‌తో టారిఫ్‌లపై చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో పాక్‌తో జరుగుతాయని అన్నారు. ఒక రకంగా తాము అణ్వాయుధ ఘర్షణను ఆపగలిగామని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగినందుకు గర్విస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియోకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News