- Advertisement -
భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గడంతో ఐపిఎల్ 2025 సీజన్ ను త్వరలోనే పునఃప్రారంభించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ప్రకటించింది. ఈ సందర్భంగా రీ షెడ్యూల్ ను కూడా వెల్లడించింది. మే 17 నుంచి ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ మ్యాచ్ లను నిర్వహించేందుకు కేవలం బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ వేదికలనే ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో జరగాల్సిన రెండు మ్యాచ్‌లను ఇతరు వేదికలకు తరలించారు. ఇక, మే 29న తొలి క్వాలిఫయర్, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న రెండో క్వాలిఫయర్ లు నిర్వహిస్తామని తెలిపింది. ఇ్క, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు బిసిసిఐ పేర్కొంది.
- Advertisement -