Tuesday, May 13, 2025

బుర్కినా ఫాసోలో జిహాదీ మూకల దాడులు.. 100మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

బమాకో: ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ మూకలు మారణహోమం సృష్టించారు. పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా జరిపిన దాడిలో 100 మందికి పైగా మరణించారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది సైనికులు, సహాయ కార్మికులు ఉన్నారని స్థానిక నివాసితులు తెలిపారు. సైనిక స్థావరం, డిజిబో పట్టణంతో సహా అనేక ప్రదేశాలపై దాడులు చేశారు. సహెల్ ప్రాంతంలో ఉన్న జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ లేదా JNIM అని పిలువబడే అల్-ఖైదాతో జతకట్టిన జిహాదీ మూకలు దాడులకు పాల్పడ్డారు. అనంతరం ఈ దాడులకు బాధ్యత తమదేనని ప్రకటించాయి.

23 మిలియన్ల మంది జనాభా కలిగిన బుర్కినా ఫాసో దేశ పాలనా సైనిక జుంటా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో భద్రతా సంక్షోభం కారణంగా జిహాదీ, అల్ ఖైదా తీవ్రవాదులతో తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో ఇది ఒకటి. హింసాత్మక తీవ్రవాదానికి ప్రపంచ హాట్ స్పాట్‌గా మారింది. 2022లో రెండు తిరుగుబాట్లకు దారితీసిన హింస ఫలితంగా బుర్కినా ఫాసోలో దాదాపు సగం ప్రాంతం కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News