Tuesday, May 13, 2025

బబ్లీగా ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తా: అదితి శంకర్

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం.(Bhairavam) విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. భైరవం మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితి శంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో బబ్లీగా ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి దగ్గరగానే ఉంటుంది. ఈ మల్టీస్టార్ సినిమాలో నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది.

హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్‌లు తమిళ్ మాట్లాడతారు. దీంతో ఈ సినిమాలో నటించడం సులభంగా అనిపించింది. ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. ఇందులో రెండు డాన్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా నాకు ఫేవరెట్. -నిర్మాత రాధమోహన్ ప్రతిరోజు సెట్‌కి వచ్చేవారు. షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేసేవారు. విజయ్ కనకమేడల – చాలా మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయనకు ఆర్టిస్టుల నుంచి ఎలాంటి నటనను రాబట్టు కోవాలో తెలుసు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News