భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా.. పలు ప్రాంతాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. ముందు జాగ్రత్త గగనతల పరిమితులు, భద్రతా చర్యల కారణంగా ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు.. మే 13 నుండి ఉత్తర, పశ్చిమ భారత్ లోని అనేక నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేసాయి.
శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌కు బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. అలాగే, ఎయిర్ ఇండియా కూడా.. జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. “ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు ఎలా అంతరాయం కలిగిస్తుందో మేము అర్థం చేసుకున్నాం. దీనివల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాము. మా బృందాలు పరిస్థితిని చురుకుగా పర్యవేక్షిస్తున్నాయి. అప్డేట్స్ ను మీకు వెంటనే తెలియజేస్తాయి” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.