- Advertisement -
శ్రీనగర్: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించి.. పాకిస్థాన్, పిఒకెలలోని ఉగ్రవాద(Terrorists) స్థావరాలపై భారత్ దాడి చేసింది. మరోవైపు భద్రతా బలగాలు భారత్‌లో తలదాచుకున్న ఉగ్రవాదలను అంతం చేస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో(Encounter) లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. అవి అలా పెరుగుతు పోషియాన్ వరకూ విస్తరించాయి. ఉగ్రవాదలను హతం చేసేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా కృషి చేస్తున్నాయి.
- Advertisement -