- Advertisement -
అమరావతి: పోలీసులు, సోషల్ మీడియా ద్వారా టిడిపి ఆర్గనైజ్డ్ క్రైమ్ (Organized crime)చేస్తోందని మాజీ మంత్రి ఆర్ కె రోజా విమర్శించారు. ఎపిలో నారావారి నరకాసుర పాలన సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి నేతలు, మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ తో రెచ్చిపోతున్న వారికి అంబేడ్కర్ రాజ్యాంగంతో శిక్ష అమలు జరుగుతుందని చెప్పారు. కేసులు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదని, మహిళల్ని వేధించిన వారందరి పేర్లు బ్లూ బుక్ లో రాస్తామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టినవాళ్లకు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి 2.0 లో వడ్డీతో సహా చెల్లిస్తామని రోజా పేర్కొన్నారు.
- Advertisement -