Wednesday, May 14, 2025

ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే, వైసిపి ప్రభుత్వం మెయింటెన్స్ కూడా లేకుండా గాలికొదిలేసిందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Ramanaidu) విమర్శించారు. ఇరిగేషన్ పనుల మరమ్మత్తుల కోసం సిఎం చంద్రబాబు నాయుడు రూ.344 కోట్లు నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో రూ.10 లక్షల లోపు ఉన్న పనులను చేపట్టాలని సూచించారు. పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు కోసం టెండర్లు ఆహ్వానించామని, షార్ట్ టెండర్లు పిలవాలని అన్నారు. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News