- Advertisement -
కార్యకర్తగా మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ మేరకు హరీష్ రావు మాట్లాడుతూ.. “కెసిఆర్ మా అధ్యక్షుడు.. ఆయన చెప్పింది నేను తూ.చా. తప్పకుండా పాటిస్తా” అని అన్నారు. ఈ మాట తాను ఇప్పటికే చాలా సార్లు చెప్పానని.. ఎన్ని సార్లు అడిగిన ఇదే చెప్తానన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కెటిఆర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే.. తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కెసిఆర్ నిర్ణయాన్ని ఎప్పడు శిరసావహిస్తానని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.
- Advertisement -