- Advertisement -
హైదరాబాద్: సోషల్‌మీడియాలో పలు ఫేక్ వీడియోలు వైరల్ కావడం సాధారణం. అయితే ఆ వీడియోలు కొన్ని ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో(Shamshabad Airport) ఓ ఉగ్రవాది పట్టుబడ్డాడు అంటూ సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోని నమ్మవద్దు అంటూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఇది ఫేక్ వీడియో(Fake Video) అని నిర్ధారించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాక్ డ్రిల్ సందర్భంగా తీసిన వీడియోని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. నకిలీ వీడియోలను నమ్మొదు అంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. తప్పుడు వీడియోలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- Advertisement -