- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) జూబ్లిహిల్స్‌తో కారుతో(Car) హల్‌చల్ చేశారు. జర్నలిస్ట్ కాలనీ వద్ద కారుతో రాంగ్‌రూట్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకు వచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపి నిలదీయడంతో అక్కడి నుంచి శ్రీనివాస్ వెళ్లిపోయారు.
కాగా, ‘అల్లుడు శ్రీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఊహించినంత సక్సెస్ కాలేకపోయారు. త్వరలో ఆయన ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -