పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను అంగీకరించిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu movie) చిత్ర షూటింగ్‌ను ముగించిన పవన్, ఇక ‘ఓజి’ని కూడా ముగించే పనిలో ఉ న్నాడు. ఆయన వెంట వెంటనే డేట్స్ కేటాయిం చి తన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా పవన్ ఇదే జోరులో ముగించాలని చూస్తున్నాడ ట. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇక దర్శకుడు హ రీష్ శంకర్ కూడా ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం కాకుండా ముగించాలని చూస్తున్నాడట. ఈ చిత్ర షూటింగ్‌ను జూన్ 12 నుంచి నిర్విరామంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడుతో జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాతో(Harihara Veeramallu movie) పవన్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఫిల్మ్ మేకర్స్ రూపొందించనున్నారు.