హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్తేమి కాదు. సావిత్రి కాలం నుంచే ఉన్నది ఆ ట్రెండ్. కానీ చాలామంది అగ్ర కథానాయికలు నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకున్నారు. ఎంతో నష్టపోయారు. నిర్మాణం గురించి అవగహన లేకపోవడం, విపరీతంగా ఖర్చు పెట్టడం, నమ్మి బాధ్యతలు అప్పచెప్పితే వాళ్ళు మోసం చెయ్యడం వంటి కారణాల వల్ల సావిత్రి, జయసుధ, సౌందర్య.. ఇలా ఎందరో నష్టపోయారు. తాజాగా సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆమె తాను ఎంతో తెలివైన దానిని అని నిరూపించుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిర్మాతగా భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ అనే తన సొంత బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూస్ వచ్చాయి. మొత్తానికి నిర్మాతగా సమంత మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో సమంత అతిధి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.