పలువురి పాత నేరస్తుల బైండోవర్
మల్కాజిగిరి జోన్ డిసిపి పద్మజారెడ్డి
మన తెలంగాణ/బోడుప్పల్ : పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్ (Cordon search) నిర్వహిస్తున్నామని మల్కాజిగిరి డిసిపి పద్మజారెడ్డి అన్నారు. మంగళవారం (Medipalli ) మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారం డబుల్ బెడ్ రూమ్ వద్ద కార్డన్ సెర్చ్(Cordon search) నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ లలో చేపట్టిన తనిఖీల్లో డిసిపి, ఎసిపి, మేడిపల్లి (Medipalli) ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి లతో పాటు నాచారం, ఉప్పల్, పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన 240 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 40 చిన్న సిలిండర్లు, 19.6 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురు రౌడీషీటర్లు, 10 అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.