- Advertisement -
మన తెలంగాణ/బోడుప్పల్: ప్రజల భద్రతను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిపల్లి(Medipally) ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మేడిపల్లి మెయిన్ రోడ్డులో ఆర్టిసి బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వారి లగేజ్ బ్యాగులను చెక్ చేసి ఆకస్మిక తనిఖీలు(Police Checking) నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గోవిందరెడ్డి మాట్లాడుతూ… ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే, అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే, వేరు వేరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి డయల్ 100 ను సంప్రదించగలరని ప్రజలకు సూచనలు చేశారు.
- Advertisement -