టీం ఇండియా మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కి జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ.. అతని బాటలోనే విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో జట్టుకు తదుపరి కెప్టెన్‌గా(Test Captain) ఎవరిని నియమించాలనే సమస్య తలెత్తింది. కొంత మంది స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని అంటుండగా.. మరికొందరు శుభ్‌మాన్ గిల్‌కు(Shubhman Gill) ఈ బాధ్యతలు లభిస్తాయని అంటున్నారు. బుమ్రాకు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే వంటి మాజీలు అభిప్రాయపడ్డారు.
కానీ, శుభ్‌మాన్ గిల్‌పై మాత్రం మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ ఆడే తుది జట్టులో అతనికి చోటు దక్కడమే డౌట్ అని.. అలాంటి వ్యక్తికి కెప్టెన్సీ ఎలా ఇస్తారని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో 32 మ్యాచులు ఆడిన గిల్ ఏడు హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలతో 1893 పరుగులు చేశాడు. అయితే విదేశీ గడ్డపై అతనికి మంచి రికార్డు లేదు. బార్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల సిరీస్‌లో గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో శ్రీకాంత్.. గిల్‌పై(Shubhman Gill) విమర్శలు చేశారు. ‘‘వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనలో ఈ బ్యాట్స్‌మెన్స్ అంతగా రాణించలేదు. టెస్ట్ క్రికెట్‌లో అతను టెస్ట్ క్రికెట్‌లో ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదు. అందుకే అతని స్థానంలో జస్ప్రిత్ బుమ్రానే కెప్టెన్ చేయడం ఉత్తమం. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే.. కెఎల్ రాహుల్ లేదంటే రిషబ్ పంత్‌ను కెప్టెన్(Test Captain) చేయడం బెటర్’’ అని శ్రీకాంత్ అన్నారు.