- Advertisement -
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. భీమడోలు మండలంలోని పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు తిరుగు ప్రయాణంలో వేడి తాపాన్ని తట్టుకోలేక మధ్యలో కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. కాలకృత్యాల కోసం చెరువులోకి వెళ్లిన ముగ్గురు.. అందులో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని పెదవేగి మండలంలోని వేగివాడ గ్రామానికి చెందిన అజయ్(28), అభిలాష్(16), సాగర్(16)లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టో మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -