Thursday, May 15, 2025

రోహిత్ శర్మను ఇంటికి పిలిచి సత్కరించిన సిఎం

- Advertisement -
- Advertisement -

ముంబై: టీం ఇండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత టి-20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన రోహిత్ తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే రోహిత్ శర్మను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis )సత్కరించారు.

అయన తన నివాసానికి ఆహ్వానించిన సిఎం హిట్ మ్యాన్‌ని(Rohit Sharma) సత్కరించారు. ఈ విషయాన్ని సిఎం స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నా నివాసం వర్షలో భారత క్రికెటర్ రోహిత్ శర్మను స్వాగతించడం, కలవడం, మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్ నుంచి అతను రిటైర్ అవ్వడం.. మరియు ఆయన ప్రయాణంలోని తదుపరి అధ్యాయానికి విజయం కలగాలని నేను ఆశిస్తున్నాను’’ అంటూ సిఎం(Devendra Fadnavis )పేర్కొన్నారు.

ఇక టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన రోహిత్ వన్డేల్లో మాత్రం కొనసాగుతానని ప్రకటించాడు. రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో జట్టులో అతని స్థానంతో పాటు కెప్టెన్ స్థానం కూడా ఖాళీ అయింది. త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా అని చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News