Thursday, May 15, 2025

బిఎస్‌ఎఫ్ జవాన్ ను సురక్షితంగా భారత్ కు అప్పగించిన పాక్

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ లో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి , పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ రేంజర్లు అరెస్ట్ చేసిన బీఎస్ ఎఫ్ జవాన్ ను సురక్షితంగా మనదేశానికి అప్పగించారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన పూర్ణమ్ కుమార్ షాను బుధవారం అటారీలోని చెక్ పోస్ట్ వద్ద భారతీయజవాన్లకు పాక్ ఆర్మీ అప్పగించింది. 2025 ఏప్రిల్ 23న బిఎస్ ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10-30 గంటల ప్రాంతంలో అమృత్ సర్ లోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద భారతదేశానికి అప్పగించారు. అప్పగించ శాంతియుతంగా, ప్రొటోకాల్ ప్రకారం జరిగినట్లు బీఎస్ ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్ణమ్ కుమార్ షా పాక్ భుభాగంలో ప్రవేశించినప్పుడు యూనిఫామ్ లో ఉన్నాడు. అతని చేతిలో సర్వీస్ రైఫిల్ ఉంది.

40 ఏళ్ల జవాన్ 17 ఏళ్లుగా బిఎస్ ఎఫ్ లో పనిచేస్తున్నాడు.అతడి స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ.జమ్మూకశ్మీర్ లోని పహల్గాం లో టెర్రరిస్ట్ ల దాడిలో 26 మంది పర్యాటకులు చమిపోయిన ఒకరోజు తర్వాత అంటే ఏప్రిల్ 23న పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో విధులు నిర్వహిస్తున్న బిఎస్ ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా అనుకోకుండా సరిహద్దు దాటాడు.ఆ టెర్రరిస్ట్ దాడి వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు హెచ్చడంతో జవాన్ అప్పగింతలో జాప్యం జరిగింది. జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ దాదాపు 2,323 కిలోమీటర్ల మేరకు భారత్ – పాక్ సరిహద్దు ను బీఎస్ ఎఫ్ జవాన్లు నిర్విరామంగా కాపాడతారు. గస్తీ సమయంలో బీఎస్ ఎప్ జవాన్లు పొరపాటున సరిహద్దు దాటడం, ఉభయపక్షాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ తర్వాత అప్పగించడం సాధారణమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News