- Advertisement -
నగర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణదారుల నుంచి భారీగా వసూళ్ల దందా
అడిగినంత ఇవ్వకుంటే ఇళ్లు కూల్చివేస్తామంటూ బెదిరింపులు
ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తుల్జాసింగ్ పై కేసు నమోదు
హైదరాబాద్: జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ డ్రైవర్ తుల్జాసింగ్ వసూళ్ల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నగరంలో ఇళ్ల నిర్మాణ దారులను లక్ష్యంగా చేసుకొని బెదిరిస్తూ వసూళ్లకు తెగ పడ్డాడు. అడిగినంత ఇస్తేనే ఇల్లు ఉంటుంది.. లేకుంటే కూల్చివేస్తామంటూ బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తూ వసూళ్లు చేస్తున్నాడు. ఇటీవల ఉప్పల్ మెయిన్ రోడ్ లో ఇంటి నిర్మాణం చేస్తున్న యజమానిని డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు. భరించలేని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -