- Advertisement -
లక్నో: ప్రపంచంలో ఎక్కడైనా స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు యువతులకు పురుషులు అంటే ఇష్టం లేదు. దీంతో ఇద్దరు మధ్య చిగురించిన ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బదాయూ కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో మీరా, స్వప్న అనే యువతులు పెళ్లి చేసుకున్నారు. తమ వివాహానికి సహాయం చేయాలని ఓ న్యాయవాదికి విజ్ఞప్తి చేశారు. గత మూడు నెలల ఇద్దరు కలిసి ఉంటున్నామని, గాఢంగా ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకున్నామని, సమాజంలో దంపతులుగా ఉండేందుకు అవకాశం కల్పించాలని కోరారు. భారతీయ చట్టాలలో స్వలింగ వివాహం అనేది లేదని సదరు న్యాయవాది వారికి తెలిపారు. తమకు పురుషులు అంటే ఇష్టం లేకపోవడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, తమ కుటుంబాలు అంగీకారం తెలపకపోయినా తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు.
- Advertisement -