Thursday, May 15, 2025

సైనిక్ స్కూల్ వివాదంపై రాజకీయం చేయడం తగదు: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైనిక్ స్కూల్ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హుస్నాబాద్,సిరిసిల్ల జిల్లాలో సైనిక్ స్కూల్ కోసం గత నెల 15న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశానని వివరించారు. ఈ సంద్భరంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారన్నారు. తన విజ్ఞప్తికి రాజ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందనన్నారు. దీనిపై రాజకీయం చేయడం తగదని బండి హెచ్చరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసిరావాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News