Friday, May 16, 2025

ఈడీ సోదాలు.. వైఎస్‌ రెడ్డి నివాసంలో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. ముంబయి వసాయి విరార్ మున్సిపల్ కార్పోరేషన్ స్కామ్‌లో భాగంగా ఈడీ అధికారులు.. ముంబై, హైదరాబాద్‌తో పాటు 12 ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించారు. ముంబైలో టౌన్‌ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వైఎస్‌ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేసి.. భారీగా నగదును గుర్తించినట్లు సమాచారం. మొత్తం రూ.9 కోట్లకు పైగా నగదుతో పాటు రూ.23.25 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News