- Advertisement -
సిఎం రేవంత్‌రెడ్డి న్యూలుక్ అందరినీ ఆకట్టుకుంది. గోధుమరంగు కలర్ కుర్తాలో ఆయన కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి వెళ్లినప్పుడు ఆయన న్యూలుక్‌ను చూసి అభిమానులు సంతోషపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. గురువారం తొలిరోజు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి వెళ్లారు. ఈ పుష్కరాలకు వెళ్లే సమయంలో సిఎం రేవంత్ రెడ్డి గోధుమరంగు కలర్ కుడ్తాలో వెళ్లడంతో ఈ న్యూలుక్ అక్కడి వారిని ఆకట్టుకుంది. సిఎం రేవంత్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ తదితరులు ఘన స్వాగతం పలికారు.
- Advertisement -