Friday, May 16, 2025

చెట్లు పెంచకపోతే జైలుకే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భం గా సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృ త్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్య లు చేసింది. పర్యావరణ అనుమతు లు తీసుకున్నారా? లేదా? చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. లాంగ్ వీకెండ్ చూ సి చెట్లను ఎందుకు నరికివేశారని ధర్మాస నం మరోసారి ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ సం దర్భంగా సు ప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధం గా వ్యవహరించినా ఊరుకునేది లేదని ధర్మాస నం హెచ్చరించింది. అలాగే పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్య లు చేపట్టకపోతే సిఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

కాగా కేంద్ర సాధికారిక సంస్థ (సిఇసి) దాఖలు చే సిన అఫిడవిట్‌పై కౌంట ర్ వేసేందుకు కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. దీంతో జులై 23వ తేదీలోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ జులై 23వ తేదీకి వాయిదా వేసింది. అలాగే వి ద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చే సిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన ఐఎను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. ఆ విషయంలో ప్రత్యే కంగా మరో పిటీషన్ ను దాఖలు చేయాలని, ఈ కేసులో కలప కూ డదని ధర్మాసనం స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్య ప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చె బుతూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖ లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వా నికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు యధాస్థితి కొనసాగించాలని పేర్కొంది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకో మని స్ప ష్టం చేసింది. గత విచారణ సందర్భంగా వం దల ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలంది.

ఈ క్రమంలో గత విచారణ సం దర్భంగా కంచ గచ్చిబౌలి భూముల గురించి సుప్రీం కోర్టుకు సిఇసి మధ్యంతర నివేదికను అందజేసింది. కాగా సిజెఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేసు ఇదే. విచారణ ప్రారంభంలోనే వివరాలను పరిశీలించిన సిజెఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘా టు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసా రంగా డజన్ల కొద్దీ బుల్డోజర్‌లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముం ద స్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆ గ్రహం వ్యక్తం చేశా రు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?లేదా? అన్నది స్ప ష్టం చేయాలన్నారు. జరిగిననష్టాన్ని పూ డ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చె ప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు. కాగా కం చ గ చ్చిబౌలి భూముల్లో ప్రస్తుతం ఎలాంటి పను లు జరగడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News