Saturday, May 17, 2025

ఐపిఎల్ 2.0కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచి పోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025 శనివారం పునఃప్రారంభం కానుం ది. మధ్యలోనే ఆగిపోయిన ఐపిఎల్‌ను సరికొత్త షెడ్యూల్‌తో తిరిగి నిర్వహించనున్నారు. శనివారం ప్రారంభమయ్యే ఐపిఎల్ రెండో దశ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ము గుస్తోంది. ఈసారి లీగ్ దశతో కలుపుకుని మొత్తం 17 మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్ దశలో 13 మ్యాచ్‌లు ఉండగా నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. రెండో దశ ఐపిఎల్‌ను ఏడు వేదికల్లో నిర్వహించనున్నారు. బెంగళూరు, లక్నో, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జైపూర్,అహ్మదాబాద్‌లు ఈసారి ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చెన్నై, హైదరాబాద్, చండీగఢ్ నగరాలకు ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం దక్కలేదు. హైదరాబాద్, చెన్నైలలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చా రు. అంతేగాక ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ముం దుగా ప్రకటించిన వేదికల్లో కాకుండా ఇతర చోట్ల నిర్వహించాలని బిసిసిఐ భావిస్తున్నట్టు సమాచారం. ఇక రెండో దశ ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేసింది.

శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఆదివారం జరిగే మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతాయి. గుజరాత్ మ్యాచ్‌కు ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్‌కు జైపూర్ ఆతిథ్యం ఇస్తున్నా యి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మే 19న లక్నోతో, మే 23న బెంగళూరుతో హైదరాబాద్ ఆడుతుంది. ఇక మే 25న ఢిల్లీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. తొలి దశ షెడ్యూల్‌లో కోల్‌కతాతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ను ఢిల్లీకి మార్చారు. ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య అర్ధాంతరంగా నిలిచి పోయిన మ్యా చ్‌ను మళ్లీ మొదటి నుంచి నిర్వహించనున్నారు. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, మే 27నలక్నో, బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ పోటీలకు తెరపడుతుంది. ఇక తొలి క్వాలిఫయర్ మే 29న, ఎలిమినేటర్ మే 30న జరుగుతుంది. రెండో క్వాలిఫయర్ పోరు జూన్ ఒకటిన నిర్వహిస్తారు. ఫైనల్ జూన్ 3 (బుధవారం) జరుగనుంది. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.

అహ్మదాబాద్, ముంబైలలో ఈ మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.మరోవైపు ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఇదిలావుంటే కిందటి ఐపిఎల్ సీజన్‌లతో పోల్చితే ఈసారి మెగా టోర్నమెంట్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదనే చెప్పాలి. రెండో దశ పోటీలకు కూడా అభిమానుల నుంచి పెద్దగా స్పందన రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈసా రి బెంగళూరు, ముంబై, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గుజరాత్, పంజాబ్, బెంగళూరు జట్లకు నాకౌట్ బెర్త్‌లు దాదాపు ఖరారైనట్టే. ఢిల్లీ, ముంబై జట్లు కూడా నాకౌట్ రేసులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News