Friday, May 16, 2025

పెళ్లి వేడుకల్లో తీవ్ర విషాదం..డిజే పాటలకు స్టెప్పులేస్తూ

- Advertisement -
- Advertisement -

పెళ్లి వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు ఎంతో ఉత్సహంగా కనిపించిన వ్యక్తి డిజే పాటలకు స్టెప్పులు వేస్తు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాసూరు గ్రామంలో గురువారం రాత్రి యువతీ, యువకుడికి పెళ్లి జరిగింది. పెళ్లికి డిజే పెట్టారు. ఈ పెళ్లికి బంగారు నాయుడు వచ్చారు. డిజే పాటలకు స్టెప్పులేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు బంగారు నాయుడు. గమనించిన బంధువులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. అతని మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News